virat kohli: అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
virat kohli: 100వ టెస్టులో 8వేల పరుగుల మైలురాయిని దాటిన కోహ్లీ
అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన వందో టెస్టులో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 8వేల పరుగులు పూర్తిచేశాడు కోహ్లీ. దీంతో ఈ ఘనతను సాధించిన 6వ ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీ కంటే ముందున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్ సైతం తన వందో టెస్టులోనే 8వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం.
Next Story




