Virat Kohli: రంజీ ట్రోఫీలో కేవలం 6 పరుగులకే బౌల్డ్ అయిన కోహ్లీ.. ఖాళీ అయిన స్టేడియం

Virat Kohli Fails in Ranji Trophy Return After 13 Years Dismissed for 6 Runs
x

Virat Kohli : రంజీ ట్రోఫీలో కేవలం 6 పరుగులకే బౌల్డ్ అయిన విరాట్ కోహ్లీ.. ఖాళీ అయిన స్టేడియం

Highlights

Virat Kohli: విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చారు. అతని బ్యాటింగ్ చూడటానికి వేలాది మంది అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియంలో గుమిగూడారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చారు. అతని బ్యాటింగ్ చూడటానికి వేలాది మంది అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియంలో గుమిగూడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇబ్బంది పడుతున్న కోహ్లీ రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో అదరగొడతాడని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అది జరగలేదు. ఈ హోమ్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ విఫలం అయ్యారు. అతడు కేవలం ఆరు పరుగులకే అవుట్ అయ్యారు. రైల్వేస్ తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సంగ్వాన్ అతన్ని బౌల్డ్ చేశారు.

దేశవాళీ క్రికెట్‌లో కూడా విఫలం అయ్యాడని కోహ్లి రిటైర్ కావాలని కొందరు ఆయనకు సూచిస్తున్నారు. ఢిల్లీ తరఫున ఆడుతున్న రంజీ ట్రోఫీలో కోహ్లీ ఆడుతున్నారు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన పేలవమైన ప్రదర్శన కనబర్చారు. రైల్వేస్‌పై అతను కేవలం 15 బంతులు మాత్రమే ఆడి 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రతి ఇన్నింగ్స్‌లోనూ ఆఫ్ సైడ్ బాల్‌ను ఎడ్జ్ చేసిన తర్వాత కోహ్లీ స్లిప్‌లో అవుట్ అయ్యాడు. కాకపోతే ఈ మ్యాచులో బౌల్డ్ అయ్యాడు.

హిమాన్షు సంగ్వాన్ బంతిని ఓవర్ ది వికెట్ నుండి ఆఫ్ స్టంప్ వైపునకు వేశాడు. ఈ బంతిని అంచనా వేయడంలో విరాట్ కోహ్లీ ఫెయిలయ్యారు. బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి ఆఫ్ స్టంప్ ను పడగొట్టింది బంతి. ఈ వికెట్‌ తీయడాన్ని హిమాన్షు చాలా ఎంజాయ్ చేశాడు. అదే సమయంలో స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు. కోహ్లీ ఔట్ అయిన తర్వాత, చాలా మంది అభిమానులు స్టేడియం వదిలి వెళ్లారు.

హిమాన్షు సంగ్వాన్ ఎవరు?

విరాట్ కోహ్లీని ఔట్ చేసిన హిమాన్షు సంగ్వాన్ వయసు 29 సంవత్సరాలు. అతను ఢిల్లీ అండర్-19 జట్టుకు కూడా ఆడారు. అతను దేశవాళీ క్రికెట్‌లో రైల్వేస్ తరపున ఆడుతున్నారు. హిమాన్షు 2019 సంవత్సరంలో రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. అతను ఇప్పటివరకు 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఇందులో అతను 40 ఇన్నింగ్స్‌లలో కేవలం 19.92 సగటుతో 77 వికెట్లు పడగొట్టాడు. అతను 17 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు, 7 టీ20ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories