ఔట్ ప్రకటించినందుకు అంపైర్‌పై భారత క్రికెటర్ తిట్ల దండకం

ఔట్ ప్రకటించినందుకు అంపైర్‌పై భారత క్రికెటర్ తిట్ల దండకం
x
శుభమ్ గిల్
Highlights

రంజీ మ్యాచ్‌లో కాసేపు గందరగోళం చోటుచేసుకుంది. అంపైర్ ఔట్ ప్రకటించిన క్రికెటర్ క్రీజును వదలి వెళ్లకపోవడంపై వివాదం చెలరేగింది.

రంజీ మ్యాచ్‌లో కాసేపు గందరగోళం చోటుచేసుకుంది. అంపైర్ ఔట్ ప్రకటించిన క్రికెటర్ క్రీజును వదలి వెళ్లకపోవడంపై వివాదం చెలరేగింది. మొహాలీ వేదికగా ఢిల్లీతో పంజాబ్ జట్టు తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు క్రికెటర్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వికెట్ ఈ వివాదానికి కారణమైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఔట్‌ కాకపోయినా అంపైర్ పాశ్చిమ్ పఠాన్ ఔట్ ప్రకటించాడు. దీంతో తాను ఔట్ కాలేదని శుభమ్ గిల్ క్రీజులో ఉన్నారు. క్రీజును వదలి వెళ్లేది లేదంటూ మొండికేశాడు. అంతేకాకుండా అంపైర్ పై తిట్ల దండకం ప్రారంభించాడు. ఈ క్రమంలో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. అది ఔట్‌ కాదని టీవీ రిప్లేలో స్పష్టంగా తెలియడంతో అంపైర్ పై దుర్భాషలాడుతూ.. క్రీజులోనే ఉండిపోయాడు.

ఈ నేపథ్యంలో కలుగుచేసుకున్న మ్యాచ్ రిఫరీ వారిద్దరి మధ్య గొడవకు పుల్ స్టాప్ పెట్టాడు. దీంతో41 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసిన శుభమ్ గిల్ గ్రౌండ్ ను వదలి వెళ్లాడు. అపైర్ పఠాక్ ను తీవ్ర పదజాలంతో దూషించాడు. అంపైరింగ్ తెలుసా క్రీజును మండిపడుతూ.. క్రీజును వదలి వెళ్లాడు. రిఫరీ జోక్యంతో మళ్లీ మ్యాచ్‌ ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో మొదట పంజాబ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఓ పెనర్ సాన్విర్ సింగ్ - శుభమ్ గిల్ బ్యాటింగ్ ఆరంభించారు.

ఓపెనర్ సాన్విర్ సింగ్ డకౌట్ గా వెనుతిరగగా.. రెండో స్థానంలో వచ్చిన గుర్‌క్రీత్ సింగ్ మాన్‌తో ఇన్నింగ్స్ చక్కదిద్దారు గిల్. అయితే ఈ క్రమంలో ఢిల్లీ బౌలర్ జీత్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతి శుభమ్ గిల్ బ్యాట్ కు ఫ్యాడ్లకు తాగి రావత్ చేతికి చిక్కింది. ఢిల్లీ ఆటగాళ్లు అపీల్ చేశారు. దీంతో అంపైర్ పఠాక్ శుభామ్ గిల్ అవుటని ప్రకటించాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో పంజాబ్ జట్టు 6 వికెట్ల నష్ట్రానికి 241 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ మన్ దీప్ సింగ్ 154బంతు్లో 72 పరుగులు చేసి నాకౌట్ గా నిలిచాడు.

గతంలో కూడా రంజీ క్రికెట్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో సంవత్సరం డిసెంబర్‌ నెలలో ముంబై బరోడా జట్టు మధ్య మ్యాచ్ లో ఇలాంటి వివాదమే చోటుచేసుకుంది. ఆ మ్యాచ్ లో బరోడా బ్యాట్స్‌మన్‌ యూసఫ్‌ పఠాన్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడు. దీంతో ఔట్‌ కాకపోయినా అంపైర్ ఔట్ ప్రకటించడంపై యూసఫ్ పఠాన్ మండిపడ్డాడు. దీంతో భారంగా పెవిలియన్‌ వీడాడు. తొలుత ఇష్టపడని యూసఫ్ పఠాన్ క్రీజులను వదలి వెళ్లడానికి ఇష్టపడలేదు. క్రీజును అట్టిపెట్టుకుని ఉన్నాడు. చివరికి నిరాశతో గ్రౌండ్ ను వదలి వెళ్లాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories