Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు షాక్

Virat Kohli: టీ-20 కెప్టెన్‌గా తప్పుకోనున్న టీమిండియా సారధి

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 6:43 PM IST
Virat Kohli Decided to Step Down as a T20 Team India Captain
X
టీం ఇండియా కెప్టెన్ గా తప్పుకోనున్న విరాట్ కోహ్లీ (ఫైల్ ఇమేజ్)

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. టీ-20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్‌బై చెప్తానని ప్రకటించాడు. వన్డే, టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తానన్న విరాట్ కోహ్లీ పని ఒత్తిడి కారణంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. దాదాపు తొమ్మిదేళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నానన్న విరాట్.. ఆరేళ్లుగా కెప్టన్‌గా వ్యవహరిస్తున్నానన్నాడు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, రోహిత్‌శర్మలతో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. దీంతో విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అనంతరం రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఛాన్స్ రానుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story