Virat Kohli: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. నాలుగో స్థానంలో కోహ్లీ

Virat Kohli: 6వ స్థానం నిలబెట్టుకున్న కేఎల్ రాహుల్

Sandeep Eggoju
Updated on: 15 Sept 2021 7:30 PM IST
Virat Kohli at 4th Rank in ICC T20 Rankings
X

ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో విరాట్ కోహ్లీ నాలుగోవ స్థానం (ఫైల్ ఇమేజ్)

Virat Kohli: ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత మరో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. అటు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డీకాక్ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 8వ స్థానాన్ని చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో ఎటువంటి మార్పులు జరగకపోగా టాప్ టెన్‌లో భారత బౌలర్లలో ఒక్కరు కూడా నిలవలేదు. భువనేశ్వర్ కుమార్ మాత్రం 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సమయంలో ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానంలో ఉండగా భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో పాకిస్థాన్, నాలుగో స్థానంలో న్యూజిల్యాండ్, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story