Covid-19 Relief: కోవిడ్‌ బాధితులకు కోహ్లీ దంపతుల 2 కోట్ల విరాళం

Covid-19 Relief: ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరిన భారత సారథి విరాట్ కోహ్లీ వెంటనే కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 8 May 2021 11:30 AM IST
Virat Kohli and Anushka Sharma donate INR 2 crore to aid Indias Covid-19 Relief
X

Covid-19 Relief: కోవిడ్‌ బాధితులకు కోహ్లీ దంపతుల 2 కోట్ల విరాళం

Covid-19 Relief: ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరిన భారత సారథి విరాట్ కోహ్లీ వెంటనే కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కరోనా బాధితుల సహాయార్థం 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు విరాట్ కోహ్లీ. ఫండ్ రైజింగ్ కోసం స్పెషల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్‌ చేశారు. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోందని...ప్రజలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అనుష్క, తాను కెట్టోతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ మొదలెడుతున్నామని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story