Top
logo

అది పొరపాటే..అంగీకరించిన వరల్డ్ కప్ ఫైనల్స్ ఎంపైర్!

అది పొరపాటే..అంగీకరించిన వరల్డ్ కప్ ఫైనల్స్ ఎంపైర్!
Highlights

ఒక్క పొరపాటు ఎంత పని చేస్తుందో తెలిసివచ్చిన సంఘటన వరల్డ్ కప్ ఫైనల్ రిజల్ట్. అవును అంపైర్ చేసిన ఒక్క పొరపాటుతో...

ఒక్క పొరపాటు ఎంత పని చేస్తుందో తెలిసివచ్చిన సంఘటన వరల్డ్ కప్ ఫైనల్ రిజల్ట్. అవును అంపైర్ చేసిన ఒక్క పొరపాటుతో న్యూజిలాండ్ కప్ కోల్పోయింది. ఇంగ్లాండ్ ప్రపంచ ఛాంపియన్ అయింది. ఈ విషయాన్ని ఫైనల్ ముగిసిన దగ్గరనుంచీ అందరూ చెబుతూనే ఉన్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. ఇక ఈ విషయంపై ఆరోజు ఆ నిర్ణయం తీసుకున్న అంపైర్ స్పందించాడు.

వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓవర్‌ త్రో విషయంలో తాను పొరపాటు చేశానని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్‌ ధర్మసేన ఒప్పుకున్నాడు. బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలిన బంతి ఓవర్‌ త్రోగా బౌండరీకి వెళ్లడంతో దానికి ఆరు పరుగులు ఇవ్వడం తాను చేసిన పొరపాటని, ఇందుకు చింతిస్తున్నానని అన్నాడు. దీనిపై మ్యాచ్‌ అధికారులతో పాటు ఫీల్డ్‌లోనే ఉన్న మరొక అంపైర్‌ ఎరాస్మస్‌తో చర్చించిన తర్వాతే ఆరు పరగులు ఇచ్చానంటూ తెలిపాడు. ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రిప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదన్నాడు.

'నేను తప్పిదం చేసిన విషయాన్ని అంగీకరిస్తున్నా. మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీవీ రిప్లేలో చూస్తే నేను చేసిన పొరపాటు తెలిసింది. ఇందుకు నేను చాలా చింతిస్తున్నా. ఇక్కడ క్షమాపణలు కోరడానికి కూడా అర్హుడిని కానేమో. ఆ మ్యాచ్‌కు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత అది ఆరు పరుగులుగా ప్రకటించా. లెగ్‌ అంపైర్‌ ఎరాస్మస్‌తో కూడా చర్చించా. బ్యాట్స్‌మన్‌ రెండో పరుగును పూర్తి చేశాడని అంతా భ్రమపడి ఆ త్రోకు అదనంగా మరో నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దాన్ని మ్యాచ్‌ అధికారులు రిప్లేలో చూడకపోవడంతో పొరపాటు జరిగింది' అని ధర్మసేన పేర్కొన్నాడు.


లైవ్ టీవి


Share it
Top