U-19 Asia Cup: అండర్‌-19 ఆసియా కప్‌ భారత్‌ కైవసం

U-19 Asia Cup: అండర్‌-19 ఆసియా కప్‌ను యంగ్‌ టీమిండియా జట్టు కైవసం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 31 Dec 2021 7:05 PM IST
U-19 Asia Cup: India Beat Sri Lanka By 9 Wickets
X

U-19 Asia Cup: అండర్‌-19 ఆసియా కప్‌ భారత్‌ కైవసం

U-19 Asia Cup: అండర్‌-19 ఆసియా కప్‌ను యంగ్‌ టీమిండియా జట్టు కైవసం చేసుకుంది. దుబాయ్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్స్‌లో యువ ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో దుమ్ములేపారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించగా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు 9 వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది.

నూట ఏడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌ వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్‌ రఘువంశీ 56 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీతో చెలరేగగా వన్‌డౌన్‌ వచ్చిన షేక్‌ రషీద్‌ 31 పరుగులతో రఘువంశీకి తోడయ్యాడు. ఇక మరోసారి వర్షం పడటంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను 32 ఓవర్లకు కుదించడంతో పాటు లక్ష్యాన్ని కూడా నూట నాలుగు పరుగులకు తగ్గించారు.

ఎలాంటి తడబాటు లేకుండా రఘువంశీ, రషీద్‌ రాణించడంతో భారత్‌ 21.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్‌ చేసింది. మరో 63 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది యంగ్‌ టీమిండియా జట్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story