కోహ్లీ.. రెండు రికార్డులకు చేరువలో!

కోహ్లీ.. రెండు రికార్డులకు చేరువలో!
x
Highlights

బ్యాట్ పట్టుకుంటే చాలు పరుగులు వరదలా పారించే టీమిండియా కెప్టెన్ విరాట కోహ్లీ ముందు రెండు రికార్డులు ఊరిస్తూ నిలబడ్డాయి. టెస్టుల్లో ఈ రికార్డులు సాధిస్తే అతి తక్కువ మ్యాచుల్లో ఈ రికార్డులు సాధించిన వాడిగా మరో రికార్డూ కోహ్లీ ఖాతాలోకి చేరుతుంది.

బ్యాట్ పట్టుకుంటే చాలు పరుగులు వరదలా పారించే టీమిండియా కెప్టెన్ విరాట కోహ్లీ ముందు రెండు రికార్డులు ఊరిస్తూ నిలబడ్డాయి. టెస్టుల్లో ఈ రికార్డులు సాధిస్తే అతి తక్కువ మ్యాచుల్లో ఈ రికార్డులు సాధించిన వాడిగా మరో రికార్డూ కోహ్లీ ఖాతాలోకి చేరుతుంది.

రికార్డ్ నెం 1..

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో కెప్టెన్ గా రికీపాంటింగ్ పేరు మీద ఉన్న రికార్డుకు ఒక్క అడుగు దూరంలో కోహ్లీ ఉన్నాడు. సారధిగా పాంటింగ్ 19 సెంచరీలు సాధించాడు. కోహ్లీ ప్రస్తుతం 18 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు విండీస్ తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ లో సెంచరీ సాధిస్తే పాంటింగ్ రికార్డ్ సమానమవుతుంది. టెస్ట్ మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు (25) సాధించిన కెప్టెన్ గా దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్‌ స్మిత్ ముందున్నాడు.

రికార్డ్ నెం 2 ..

ఇక ఇది ఇండియా కి సంబంధించిన రికార్డు.. భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ 60 టెస్టులకు నాయకత్వం వహించాడు. తన నాయకత్వంలో టీమిండియా 27 టెస్ట్ విజయాలు అందుకుంది. ఇప్పుడు ఈ రికార్డు కూడా కోహ్లీకి చేరువైంది. ఇప్పటివరకూ 46 టెస్టుల్లో కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించాడు. ఇందులో 26 మ్యాచులు భారత జట్టు గెలిచింది. ఇంకొక్క టెస్ట్ మ్యాచ్ విజయం సాధిస్తే ధోనీ రికార్డ్ సమానమవుతుంది.

ఇప్పటివరకూ కోహ్లీ మొత్తం 25 శతకాలు సాధించాడు. వాటిలో 18 సెంచరీలు కెప్టెన్ గా సాధించడమే కావడం గమనార్హం. ఇదేవిధంగా వన్డేల్లోనూ కెప్టెన్ గా పాంటింగ్ 22 సెంచరీలు చేశాడు. కోహ్లీ 21 సెంచరీలు చేశాడు. ఇంకొక్క సెంచరీ చేస్తే పాంటింగ్ రికార్డ్ సమానమవుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories