నేడు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి పోరు

India vs Australia: విజయంతో టోర్నీ ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న జట్లు

Jyothi
Published on: 8 Oct 2023 9:43 AM IST
Today Match Between India and Australia
X

నేడు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి పోరు

India vs Australia: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ సమరానికి రంగం సిద్ధమైంది. సొంత గడ్డపై...తొలిపోరును మొదలుపెట్టబోతోంది రోహిత్ సేన. చైన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా టీమ్‌లు తలపడబోతున్నాయి.

ధోని నాయకత్వంలో 2011తర్వాత మళ్లీ భారత్‌కు వన్డే వరల్డ్ కప్ దాహం తీరలేదు. మధ్యలో రెండు టోర్నీల్లో టీమిండియా ఘోరంగా నిరాశ పరిచింది. దీంతో ఎలాగైనా ఈసారి కప్‌ను ముద్దాలను చూస్తోంది రోహిత్ సేన. పుట్టినింటిలో టోర్ని జరుగుతుండడం..టీమిండియాకు అదనపు బలం. అలాగే ఇప్పుడిన్న జట్లలో.. భారత్ సేనలే హాట్ ఫేవరెట్. సీనియర్లు, యంగ్ ప్లేయర్ల కలయికతో భారత్ జట్టు పటిష్టంగా ఉంది.

కాసేపట్లో ప్రారంభం కాబోయే ఇండియా, ఆసీస్ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. విజయంతో టోర్నీని ఘనంగా ప్రారంభించాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. చెపాక్ వేదికగా భారత్ -ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన మ్యాచ్ లు జరిగాయి. ఈసారి కూడా అలాంటి పోరు తప్పదని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story