టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడికి కరోనా.. ఆందోళనలో అభిమానులు

కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.

Samba Siva Rao
Updated on: 23 Jun 2020 8:15 PM IST
టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడికి కరోనా.. ఆందోళనలో అభిమానులు
X
Representational Image

కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కొవిడ్ బారీన పడుతూ వస్తున్నారు. తాజాగా టెన్నిస్‌ స్టార్ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా జొకోవిచ్‌ వెల్లడించాడు. జోకోవిచ్‌తో పాటు అతని కుటుంబానికి కరోనా సోకింది. జోకొవిచ్ భార్య జెలీనాకు కూడా కరోనా పాజిటివ్‌ రాగా వారి పిల్లలకు మాత్రం నెగిటివ్‌ వచ్చింది.

కాగా.. ఈ విషయంపై జోకోవిచ్‌ మాట్లాడుతూ..' నేను బెల్‌గ్రేడ్‌కు చేరుకున్న తర్వాత నా భార్య పిల్లలతో కలిసి కరోనా పరీక్ష చేయించుకున్నాను. నాకు, నా భార్యకు కోవిడ్ పాజిటివ్‌ రాగా, పిల్లలకు మాత్రం రిపోర్టులో నెగెటివ్‌ వచ్చింది. ఈ 14 రోజులు నా భార్యతో కలిసి హోం ఐసోలేషన్‌లోనే ఉంటు చికిత్స తీసుకుంటా' అని జోకివిచ్ పేర్కొన్నాడు.

అంతకుముందు అతని ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్‌ సిరీస్‌ ఈవెంట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. విమర్శకులు, టెన్నిస్‌ వర్గాలు జొకోవిచ్‌ నిర్వాకంపై మండిపడుతున్నారు. దీనిపై జొకోవిచ్‌ సోరీ చెప్పాడు. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు జరుగుతుండగానే బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్‌, క్రొయేషియా యువ ఆటగాడు బొర్నా చోరిచ్లతో పాటు జోకోవిచ్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ మార్కో పానిచి కరోనా వైరస్‌ బారీన పడ్డారు. ప్రస్తుత తరుణంలో ఈ టోర్నీలేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story