Ind VS Eng Test Match: సొంతగడ్డపై టీమ్‌ఇండియా మరో పరీక్షకు రెడీ

Ind VS Eng Test Match: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుల్లో విజయం సాధించిన ఇండియా.

Sandeep Eggoju
Updated on: 24 Feb 2021 10:43 AM IST
Tema India Ready For The 3rd Test match with England in India
X

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (ఫైల్ ఇమేజ్)

Ind VS Eng Test Match: సొంతగడ్డపై టీమ్‌ఇండియా మరో పరీక్షకు రెడీ అయింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుల్లో విజయం సాధించిన ఇండియా మొతెరా వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో తలపడనుంది. అయితే ఇప్పటికే 1-1తో సిరీస్‌లో సమ ఉజ్జీలుగా నిలిచాయ్ రెండు జట్లు. మూడో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరగనుంది.

ఇక ఇరు జట్లకూ మ్యాచ్ విజయం అత్యంత కీలకంగా మారింది. రెండో మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ మూడో టెస్ట్‌ విజయంపై కన్నేసింది. ఇక టీమిండియా కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండో టెస్ట్ జోష్‌ మూడో టెస్టులోనూ కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిస్తే టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో టీమిండియాకు బెర్త్ ఖరారవుతుంది. దీంతో ఎలాగైనా పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది భారత్.

అయితే మొతేరా పిచ్ పేస్‌కు అనుకూలించడంతో. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులో చేరనున్నాడు. ఇక ఇషాంత్‌తో పాటు హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌లలో ఒకరికిమాత్రమే అవకాశం దక్కే చాన్స్ ఉంది. మొతేరా పున:నిర్మాణం తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. ఈ స్టేడియంలో లక్షా పదివేల మంది కూర్చునే అవకాశం ఉండగా 50శాతం మందికి మాత్రమే అనుమతిచ్చారు


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story