India T20 squad for southafrica: ధోనీకి మరికొంతకాలం విశ్రాంతి!

దక్షిణాఫ్రికా తో టీమిండియా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కు జట్టును ప్రకటించారు. ధోనీకి కొంత కాలం విశ్రాంతి కొనసాగనుంది.

K V D Varma
Published on: 29 Aug 2019 10:20 PM IST
India T20 squad for southafrica: ధోనీకి మరికొంతకాలం విశ్రాంతి!
X

India T20 squad for southafrica: ధోనీకి మరికొంతకాలం విశ్రాంతి!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరికొంత కాలం విశ్రాంతి తీసుకోనున్నారు. దక్షిణాఫ్రికా తో టీమిండియా ఆడబోయే మూడు మ్యాచ్ ల సిరీస్ కు భారత జట్టును ఈరోజు ప్రకటించారు. ఈ జట్టులో ధోనీకి స్థానం కల్పించలేదు. ధోనీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన తనంత తానుగా రెండు నెలలు సెలవు కోరుకోవడంతో ఆయనకు చోటు కల్పించలేదని చెబుతున్నారు. అయితే, ధోనీని దక్షిణాఫ్రికా టూర్ కోసం సెలక్టర్లు సంప్రదించారా? లేదా అన్నది తెలియరాలేదు.

ఇక ఈ సిరీస్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా ఉంటారు. ఇక జట్టులో కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్ , ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైన్ సభ్యులుగా ఉంటారని బీసీసీఐ ప్రకటించింది.



K V D Varma

K V D Varma

Next Story