వెస్టిండీస్ టూర్: కోహ్లీ సేనదే సిరీస్!

వెస్టిండీస్ టూర్: కోహ్లీ సేనదే సిరీస్!
x
Highlights

కోహ్లీ శతక్కొట్టుడు..శ్రేయస్ అయ్యర్ మెరుపులు.. వెస్టిండీస్ పై రెండో వన్డే లో టీమిండియా విజయభేరి మోగించింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్...

కోహ్లీ శతక్కొట్టుడు..శ్రేయస్ అయ్యర్ మెరుపులు.. వెస్టిండీస్ పై రెండో వన్డే లో టీమిండియా విజయభేరి మోగించింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్ లో కోహ్లీ సేన ఘన విజయం సాధించి సిరీస్ ను 2-0 తో గెలుచుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ కు ఓపెనర్లు అద్భుతమైన పునాది వేశారు. గేల్ విరుచుకుపడడం.. లూయీస్ కడంతోక్కడంతో.. పది ఓవర్లలో 114 పరుగులు సాధించింది విండీస్. అయితే, 11వ ఓవర్‌ ఐదో బంతికి లూయిస్‌(43)ను చాహల్ బోల్తా కొట్టించాడు. తర్వాతి ఓవర్‌లోనే గేల్‌(72) కూడా ఖలీల్‌ బౌలింగ్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. వీరిద్దరూ ఔట్‌ అయ్యాక హెట్‌మైయర్‌(25), షై హోప్‌(24) ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చారు. కానీ, ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌లో వర్షంతో సుమారు సుమారు రెండు గంటల పటు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మైదానంలోకి వచ్చిన భారత బౌలర్లు పిచ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. హెట్‌మైయర్‌, హోప్‌ను వెంటవెంటనే ఔట్‌ చేసి కట్టడి చేశారు. భారీ షాట్లతో ధాటిగా ఆడుతున్న పూరన్‌(22; 12బంతుల్లో 1×4, 2×6)ను కూడా షమి బోల్తా కొట్టించాడు. బ్రాత్‌వైట్‌(16; 14బంతుల్లో 1×4, 1×6) బ్యాట్‌ ఝళిపించి విండీస్‌ను ఇన్సింగ్స్‌ను నిలబెట్టాడు. ఆఖరి 5 ఓవర్లలో విండీస్‌ మూడు వికెట్లు కోల్పోయి 29 పరుగులు సాధించింది.

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లకు 255 పరుగులుగా నిర్ధేశించారు. కెప్టెన్ కోహ్లీ 99 బంతుల్లో 114 పరుగులతో నాటౌట్ గా నిలిచి.. మ్యాచ్ ను ఒంటి చేత్తో ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే గెలిపించాడు. ఈ క్రమంలో అతనికి శ్రేయాస్ అయ్యర్ తన అర్థ శతకంతో (41 బంతుల్లో 65 పరుగులు) చెలరేగి సహకరించాడు. దీంతో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. రెండో వన్డే, మూడో వన్డే వరుసగా గెలిచి టీమిండియా సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు మ్యచుల్లోనూ విరాట్ కోహ్లీ శతకాలు సాధించడం విశేషం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories