ప్రకృతి అందాల వీక్షణలో మునిగితేలుతున్న టీం ఇండియా

admin1
Published on: 13 Feb 2020 9:42 PM IST
ప్రకృతి అందాల వీక్షణలో మునిగితేలుతున్న టీం ఇండియా
X

కివీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు దొరికిన విరామ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ప్రకృతి అందాల వీక్షణలో మునిగితేలుతున్నారు. న్యూజిలాండ్‌లోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు జట్టు సభ్యులు బయలుదేరారు. కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో కలిసి సందడి చేశాడు. బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో ఫోటోలు పోస్టు చేసింది. బీసీసీఐ పోస్టు చేసిన ఫొటోల్లో వృద్ధిమాన్ సాహా, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ , రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్‌గిల్, పృథ్వీషాలు ఉన్నారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


admin1

admin1

Next Story