KL Rahul: అవును.. ఆ బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నా

*బాలీవుడ్ నటి అతియా శెట్టికి హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్

Sandeep Reddy
Updated on: 6 Nov 2021 4:40 PM IST
Team India Player KL Rahul Says Birthday Wishes to his Girl Friend Bollywood Actress Athiya Shetty in Twitter
X

KL Rahul: అవును.. ఆ బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నా

KL Rahul: నవంబర్ 5న బాలీవుడ్​ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా పుట్టినరోజు సంద‌ర్భంగా టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. రాహుల్, అతియ శెట్టి ఇద్దరు కలిసి దిగిన ఫోటోతో పాటు 'హ్యాపీ బర్త్​డే మై లవ్' అని క్యాప్షన్​ తో షేర్ చేశాడు. దీంతో గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమాయణంపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ అతియా పుట్టినరోజు పోస్ట్ తో నిజంగానే మేము ప్రేమలో ఉన్నామని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2021 మ్యాచులను వీక్షించేందుకు అతియా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక అతియా పుట్టిన రోజున స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి ఆమెకి పుట్టినరోజు బహుమతి ఇచ్చాడు. గత కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న క్రికెటర్ కేఎల్ రాహుల్‌, అతియా శెట్టిలు పెళ్లి చేసుకున్నా ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇప్పటికే తెలిపాడు. హీరో, మోతిచూర్ చక్నాచూర్, నవాబ్​జాదే, ముబారకాన్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story