Amit Mishra: లే లే.. అమిత్ నిదురలేవయ్యా..!! అమిత్ ని ట్రోల్ చేసిన నెటిజన్లు

* ఆస్ట్రేలియాకి బదులు కివీస్ ని విజేత అంటూ ట్వీట్ చేసిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా

Sandeep Reddy
Updated on: 15 Nov 2021 4:11 PM IST
Team India Player Amit Mishra Mistakes in Twitter Post to Wish the Australia in T20 Worldcup 2021
X

Amit Mishra: లే లే.. అమిత్ నిదురలేవయ్యా..!! అమిత్ మిశ్రాని ట్రోల్ చేసిన నెటిజన్లు

Amit Mishra: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత క్రికెట్ ఆటగాడు లెగ్‌ స్పిన్నర్‌ అమిత్ మిశ్రా విజేతను అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. అయితే అమిత్ మిశ్రా గెలిచిన ఆస్ట్రేలియా జట్టును కాకుండా రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ''వరల్డ్‌కప్‌ గెలిచిన బ్లాక్‌ క్యాప్స్‌కు శుభాకాంక్షలు. ఇది సమష్టి విజయం. చాలా బాగా ఆడారు'' అని ట్వీట్ చేశాడు.‍

దీంతో నెటిజన్లు అమిత్ మిశ్రాని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. నిద్ర పోతున్నావా అమిత్ అని కొందరంటే.. మ్యాచ్ చూడలేదా అంటూ మరికొంత మంది రకరకాలుగా ట్వీట్ చేస్తూ చుక్కలు చూపించారు. ఇది గమనించిన అమిత్ మిశ్రా వెంటనే తన తప్పును తెలుసుకొని బ్లాక్ క్యాప్స్ పేరు స్థానంలో ఆస్ట్రేలియా పేరును రీప్లేస్ చేసి ట్వీట్ చేశాడు. ఇక 8 వికెట్ల తేడాతో కివీస్ పై ఘనవిజయం సాధించిన ఆసీస్ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ని కైవసం చేసుకుంది. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ లో అద్భుత బ్యాటింగ్ తో రాణించిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి మ్యాన్ అఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story