టీమిండియా వెస్టిండీస్ టూర్: పుజారా సెంచరీ..పటిష్టస్థితిలో భారత్!

టీమిండియా వెస్టిండీస్ టూర్: పుజారా సెంచరీ..పటిష్టస్థితిలో భారత్!
x
Highlights

వెస్టిండీస్ ఎ టీంతొ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ లో పటిష్ట స్థితి లో నిలిచింది. చటేశ్వర్ పుజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, రోహిత్ అర్థసెంచరీతో మెరిసాడు. తెలుగ తేజం హనుమంత విహారి నిలకడగా ఆడుతున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 297 పరుగులు చేసింది.

ప్రాక్టీస్ మ్యాచ్ లో చతేశ్వర్ పుజారా చెలరేగిపోయాడు. అజేయ సెంచరీతో భారత జట్టుకు టాప్ స్కోర్ సాధించిపెట్టాడు. వెస్టిండీస్-ఎ జట్టుతో ఆంటిగ్వా వేదికగా శనివారం రాత్రి (విండీస్ టైమింగ్స్‌) ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్‌ టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (100 రిటైర్ట్ హర్ట్: 187 బంతుల్లో 8x4, 1x6) శతకం బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 297/5తో నిలిచింది.

పుజారాకు తోడుగా రోహిత్ శర్మ అర్థ శతకం సాధించాడు.. చేతి వెలికి తగిలిన్ గాయం కారణంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో అతని స్థానంలో అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మూడురోజుల ఈ మ్యాచ్ లో తోలి రోజు భారత జట్టు పట్టు సాధించింది. టాస్ గెలిచి రహనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత్ కు శుభారంభం దక్కలేదు. మయాంక్ అగర్వాల్ (12: 28 బంతుల్లో 2x4)తో కలిసి కేఎల్ రాహుల్ (36: 46 బంతుల్లో 5x4, 1x6) ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇన్నింగ్స్ 36 పరుగుల వద్ద 11వ ఓవర్ లో మ్యాంక్ అవుట్ అయ్యాడు. తరువాత మరో రెండు ఓవర్లకే రాహుల్ కూడా వెనుదిరిగాడు. తొలి వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం మాత్రమే నెలకొల్పాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లోనే మయాంక్ ఔటవగా.. 14వ ఓవర్‌లో రాహుల్ పెవిలియన్‌కి చేరిపోయాడు. తర్వాత వచ్చిన పుజారా నిలకడగా ఆడాడు. అయితే, రహానే మాత్రం వెంటనే అవుటయిపోయాడు. అప్పుడు భారత్ స్కోర్ మూడు వికెట్లకు 53. ఈ సమయంలో పుజారాకు తోడయ్యాడు రోహిత్ శర్మ. దాంతో ఇద్దరూ స్కోరు బోర్డును పరిగేట్టిస్తూనే.. వికెట్ పడకుండా చూసుకున్నారు. దీంతో నాలుగో వికెట్ కు వీరిమధ్య 132 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

సెంచరీ తరువాత పుజారా రిటైర్ హార్ట్ గా వెనుతిరిగాడు. రోహిత్ 68 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారి క్రీజులో నిలదొక్కుకున్నాడు. వంద బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇతనికి తోడుగా వచ్చిన రిశాబ్ పంత్ దూకుడుగా ఆది 33 పురుగుల వద్ద ఔటయ్యాడు. తరువాత వచ్చిన రవీంద్ర జదేజాతో కల్సి విహారి ఆట ముగిసేసరికి అజేయంగా నిలిచాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories