ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియాకు గ్రీన్‌సిగ్నల్

Arun Chilukuri
Published on: 23 Oct 2020 9:37 AM IST
ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియాకు గ్రీన్‌సిగ్నల్
X

ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆసీస్ పర్యటనకు వెళ్లే జట్టుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లుగా తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లు సిడ్నీ , కాన్‌బెర్రాలో జరగనుండగా వచ్చే నెలలో టీంమిండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనుందని క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్ కథనం రాసుకొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం సంయిక్తంగా భారత జట్టుకు సంబంధించిన అతిథ్య ఏర్పాట్లను సమీక్షిస్తోంది. క్వారెంటైన్, శిక్షణా సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నాయ్. ఈ పర్యటనలో భాగంగా మెుదటి వన్డే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అతిథ్యం ఇవ్వనుంది నవంబర్ 27న ఈ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్‌ పింక్ బాల్‌లో ఆడనున్నారు. డిసెంబర్ 17-21 మధ్య అడిలైడ్ ఓవల్‌లో వేదికగా మెుదటి టెస్ట్ జరాగాల్సి ఉంది. కోవిడ్ పరిమితుల దృష్ట్యా వేదికను మార్చే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story