Yuvraj Singh: వివదాస్పదంగా మారిన యువరాజ్ సింగ్ ట్వీట్?

Yuvraj Singh: మాజీ టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్ వివాదాస్పదం అయింది

Sandeep Eggoju
Published on: 1 Aug 2021 5:46 PM IST
Team India Cricketer Yuvraj Singh Tweet Going to be Viral in Social Media
X

యువరాజ్ సింగ్ (ఫైల్ ఇమేజ్)

Yuvraj Singh: మాజీ టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్ వివాదాస్పదం అయింది. ఇవాళ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా క్రికెట్‌‌లో స్నేహితులతో కూడిన వీడియోను యువీ ట్వీట్ చేశాడు. అయితే, ఆ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కనిపించపోవడం మహీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో సోషల్ మీడియాలో యువీని ఏకిపారేస్తున్నారు. నిజానికి ధోనీతో యువీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో విన్నింగ్‌ కొట్టగానే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన యువీ ధోనీని గట్టిగా హత్తుకున్న మూమెంట్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్ మరచిపోలేరు. అలాంటిది ఫ్రెండ్‌షిప్‌డే వీడియోలో ధోనీ లేకపోవడం ఏంటని ఫ్యాన్స్‌ కామెంట్ చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story