వరల్డ్‌ క్రికెట్‌లో ఇండియా సరికొత్త రికార్డ్.. మూడు ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్

Team India Become No 1 Team in All Formats
x

వరల్డ్‌ క్రికెట్‌లో ఇండియా సరికొత్త రికార్డ్.. మూడు ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్

Highlights

ICC Ranking: వరల్డ్‌ క్రికెట్‌లో ఇండియా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ICC Ranking: వరల్డ్‌ క్రికెట్‌లో ఇండియా సరికొత్త రికార్డ్ సృష్టించింది. మూడు ఫార్మాట్లలో భారత్ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డ్‌ నెలకొల్పింది. నాగ్‌పూర్‌ టెస్టు విజయంతో టెస్టుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. ఇప్పటికే వన్డే, టి20 క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంది. కాగా ఇలా మూడు ఫార్మాట్స్‌లోనూ టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనత అందుకోవడంతో హిట్‌మ్యాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్రకెక్కాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories