T20 World Cup 2021: నేడు ఇంగ్లాండ్ తో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్

*దుబాయ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ *అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో కోహ్లీసేన తొలిమ్యాచ్‌

Shilpa
Updated on: 19 Oct 2021 1:16 PM IST
T20 World Cup England vs India Warm up Match Today 18 10 2021
X

T20 World Cup 2021: నేడు ఇంగ్లాండ్ తో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్

T20 World Cup 2021: టీ 20 వరల్డ్‌కప్‌ నిన్న స్టార్ట్‌ అయ్యింది. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ నేడు ఇంగ్లాండ్ తో జరగనుంది. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరిగే వార్మ్ అప్ మ్యాచ్‌లో తమ సత్తా చాటేందుకు రెండు జట్లు రెడీగా ఉన్నాయి. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇండియా టీం అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈరోజు ఇంగ్లాండ్ తో టీమిండియా మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇన్నాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌ల్‌ ఆడిన ఇండియన్‌ క్రికెటర్స్‌కు ప్రాక్టీస్ సమస్య కాదు. కానీ, అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే తొలిమ్యాచ్‌లో నెగ్గడానికి కోహ్లీసేన రెడీ అవుతోంది.

Shilpa

Shilpa

Next Story