IPL 2021 - RR vs SRH: రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్ టీం

IPL 2021 - RR vs SRH: 165 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో చేధించిన టీం, అర్థసెంచరీలతో మెరిసిన కేన్ విలియమ్సన్, జాన్సన్ రాయ్

Shireesha
Published on: 28 Sept 2021 8:10 AM IST
Sunrisers Hyderabad Won the Match on Rajasthan Royals IPL 2021 Second Phase | Cricket Live Updates
X

రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్ టీం

IPL 2021 - RR vs SRH: హైదరాబాద్‌ సన్‌రైజర్స్ టీం పోరాడి గెలిచింది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించి శభాష్‌ అనిపించుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో సన్‌రైజర్స్‌ టీం 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో, కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. హైదరాబాద్ తరపున కేన్ విలియమ్సన్, జాన్సన్ రాయ్ అర్థసెంచరీలతో మెరిశారు.

165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు జాన్సన్ రాయ్, సాహా అద్భుత ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించడంతో గెలుపుపై కాస్త ఆశలు పెరిగాయి. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ఆ ఆశలను నిజం చేస్తూ గెలిపించారు.

Shireesha

Shireesha

Next Story