
Kavya Maran: ఐపీఎల్ 2025 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. మార్చి9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన 12 రోజుల అనంతరం ఐపీఎల్ 202 సీజన్ షురూ అవుతుంది. ఐపీఎల్...
Kavya Maran: ఐపీఎల్ 2025 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. మార్చి9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన 12 రోజుల అనంతరం ఐపీఎల్ 202 సీజన్ షురూ అవుతుంది. ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ మ్యాచులు జరిగితేనే మామూలుగా ఉండదు. అలాంటిది ఐపీఎల్ అంటే మస్త్ మజా ఉన్నట్టే. ఫ్యాన్స్ అరుపులు, కేకలు, బంతి, బంతికి నరాలు తెగే ఉత్కంఠ ఇవన్నీ ఉంటాయి.
ఇక ఫ్రాంచైజీ ఓనర్లు ప్రతి మ్యాచులోనే గ్రౌండ్ కు వస్తారు. తమ జట్లను ఎంకరేజ్ చేస్తుంటారు. మన సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ గురించి చెప్పుకుంటే మైదానంలో ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు. వికెట్ తీసినప్పుడు చూడాలి ఆమె సందడి. ప్రత్యర్థి బ్యాటర్లు సిక్సర్లు కొడితే ఆమె ఇచ్చే హావభావాలు క్షణాల్లో నెట్టింట్లో వైరల్ గా మారుతుంటాయి. 2018లో సన్ రైజర్స్ సీఈవోగా నియమితులయ్యారు కావ్య మారన్.
కావ్య మారన్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని. ఆమె సన్ గ్రూప్ బోర్డు సభ్యురాలు కూడా. ఆమె చెన్నైలోని స్టెల్లా మోరిస్ కళాశాల నుండి బి.కామ్ డిగ్రీని పొందింది. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని లియోనార్డ్ ఎన్ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA చేసింది. ఆమె సన్ టీవీ నెట్‌వర్క్ OTT ప్లాట్‌ఫామ్ అయిన సన్ నెక్స్ట్ అధిపతి కూడా. ఆమె ఆస్తులు, కార్ల కలెక్షన్స్ గురించి తెలుసుకుంటే బిత్తరపోతారు. సన్ టీవీ గ్రూప్ చైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కూతురు కావ్య మారన్. ఈ 32 ఏళ్ల చిన్నది సుమారు. 409కోట్లకు వారసురాలు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే కావ్యమారన్ కు కార్లపై కూడా ఇంట్రెస్ట్ ఎక్కువే. ఆమె దగ్గర గ్యారేజీలో లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB – ధర: రూ. 12.2 కోట్లు
బెంట్లీ బెంటెగా LWB – ధర: రూ. 6 కోట్లు
బీఎండబ్ల్యూ i7- ధర: రూ. 2.13 కోట్లు
ఫెరారీ రోమా – ధర: రూ. 3.76 కోట్లు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




