టెస్ట్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు

Arun Chilukuri
Published on: 16 Dec 2020 1:26 PM IST
టెస్ట్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు
X

టీమిండియాతో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయ్. ఇప్పటికే స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయంతో దూరం కాగా కంగారూ కీలక బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. ప్రాక్టీస్‌ సమయంలో ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌కు గాయం అయినట్లు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటింగ్‌ చేయకుండానే స్మిత్‌ హోటల్‌ రూంకు వెళ్లిపోయాడని తెలిపింది. ఐతే స్మిత్‌ గాయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ గాయం ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ఆసీస్‌కు ఇది పెద్ద దెబ్బే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story