Shreyas Iyer: నేను రెడీ.. ఇక బ్యాట్ తో సమాధానం చెప్పే టైం వచ్చింది

Sandeep Reddy
Updated on: 12 Aug 2021 11:41 AM IST
Shreyas Iyer Passed in Fitness Test And Ready to Play in IPL 2021 Second Schedule in UAE
X

శ్రేయాస్ అయ్యర్ (ట్విట్టర్ ఫోటో)

Shreyas Iyer: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ మొదటి దశలో ఢిల్లీ జట్టు కెప్టెన్ అయిన శ్రేయాస్ అయ్యర్ భుజం గాయం కారణంగా అన్ని మ్యాచ్ లకు దూరం అవగా అతడి స్థానంలో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టు సారధ్య బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భుజానికి శస్త్ర చికిత్స పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్ తాజాగా జరిగిన ఫిట్ నెస్ టెస్ట్ లో కూడా పాస్ అయ్యాడని నేషనల్ క్రికెట్ అకాడమీ తెలపడంతో త్వరలో యూఏఈలో జరగబోయే ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లలో ఈ యంగ్ ప్లేయర్ ఢిల్లీ తరపున ఆడబోతున్నట్లు టీం జట్టు యాజమాన్యం తెలిపింది.

ఇక తన భుజం గాయం కారణంగా ఇటు ఐపీఎల్ లోనే కాకుండా అటు శ్రీలంక టూర్ తో పాటు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ను శ్రేయాస్ అయ్యర్ మిస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ ప్లేయర్ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ నేను రెడీ ఇక నా బ్యాట్ తో సమాధానం చెప్పే సమయం వచ్చిందని, తను కోలుకోవడానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఇక ఇప్పటికే రిషబ్ పంత్ కెప్టెన్ గా జరిగిన 8 మ్యాచ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 మ్యాచ్ లలో ఘన విజయం సాధించి పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ లైన్ అప్ మరింత బలపడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు సెప్టెంబర్ 19 న మొదటి మ్యాచ్ లో తలపడనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సెప్టెంబర్ 22న సన్ రైసర్స్ తో ఐపీఎల్ రెండో దశ మొదటి మ్యాచ్ లో పాల్గొనబోతుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story