IND vs ZIM: గాయంతో వాషింగ్టన్ సుందర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన..

IND vs ZIM : టీమిండియా ఆఫ్‌-స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు.

Arun Chilukuri
Published on: 16 Aug 2022 7:13 PM IST
Shahbaz Ahmed Replaces Injured Washington Sundar for Zimbabwe Series
X

IND vs ZIM: గాయంతో వాషింగ్టన్ సుందర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన..

IND vs ZIM : టీమిండియా ఆఫ్‌-స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. గతవారం ఇంగ్లాండ్‌లో రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో సుందర్‌ ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు జింబాబ్వే పర్యటనకు వెళ్లట్లేదని బీసీసీఐ వెల్లడించింది. దీంతో సుందర్‌ స్థానంలో షాబాజ్‌ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని బీసీసీఐ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 27 ఏళ్ల బెంగాల్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ జింబాబ్వే సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. బెంగాల్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో షాబాజ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 2019-20 రంజీ టోర్నమెంట్‌లో 500 పరుగులు చేయడమే గాక, 35 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. టీ20 మెగా టోర్నీలో 2020 నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story