MS Dhoni's New Look: ధోని న్యూలూక్ అదుర్స్.. సాక్షి కామెంట్‌

MS Dhoni's New Look: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆయ‌న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న ఆట‌తీరుతో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు.

Karampoori Rajesh
Published on: 20 Sept 2020 4:43 PM IST
MS Dhonis New Look:   ధోని న్యూలూక్ అదుర్స్..  సాక్షి కామెంట్‌
X

Sakshi Dhoni Reacts On MS Dhoni's New Look

MS Dhoni's New Look: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆయ‌న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న ఆట‌తీరుతో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. ఎన్నో రోజులుగా ధోని ఆట కోసం ఎదురుచూస్తున్న ఆయ‌న అభిమానుల నిరీక్ష‌ణ‌కు నిన్నటి తో తెర‌ప‌డింది. దాదాపు 436 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో అభిమానులకు కనిపించారు

అయితే.. ఈ మ్యాచ్‌లో కొత్త లూక్‌తో అభిమానుల‌ను అల‌రించారు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని, గతంలో కన్నఫిట్‌గా కనిపించాడు. ఆయన ఫిట్‌నెస్‌, హెయిర్‌ స్టైల్‌ సరికొత్తగా కనిపించాడు. ఈ స్టైల్‌ లో ఆయన 'సింగం' సినిమాలో సూర్య లాగా కనిపించారు.

శనివారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచిన తర్వాత ఎంఎస్ ధోనీ మాట్లాడాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో (ధోనీ చేతిలో మైక్‌ ఉన్న ఫొటో)ని ధోనీ భార్య సాక్షి సింగ్‌.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు ఆ ఫొటోకి ఓ అద్భుత కాప్షన్ ఇచ్చారు. 'మహీ ఎంత అందంగా ఉన్నాడో' అని సాక్షి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. మహీ అభిమానులు లైకులు, షేర్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ధోని క్రికెట్‌లో అరంగేట్రం తొలినాళ్ల‌లో పొడవాటి జులపాల జుట్టుతో కనిపించాడు. ఆ త‌రువాత సాధారణ హెయిరి స్టైల్‌లో కనువిందు చేసారు . అపుడు, ఇపుడు ఎపుడైనా.. ధోనీ చిత్రాలు ఎంత వైరలో, ఇప్పుడు ఆయన కొత్త స్టయిల్ అంతే వైరల్ అయి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

శనివారం రాత్రి అబుదాబి వేదికగా ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించింది. ..

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story