IPL 2020 : ఆరంభంలో ఎవరు ఆదరగొట్టేనో! ఐపీఎల్ తొలిమ్యాచ్ కొద్ది సేపటిలో!

IPL 2020 : ఆరంభంలో ఎవరు ఆదరగొట్టేనో! ఐపీఎల్ తొలిమ్యాచ్ కొద్ది సేపటిలో!
x
Highlights

ఐపీఎల్ మొదలవుతోంది అంటే అభిమానుల్లో పండగే పండగ. సినిమాల్ని విపరీతంగా ప్రేమించే భారతీయులు ఐపీఎల్ పోటీలు జరిగిన రోజుల్లో వాటి జోలికే పోరంటే అతిశయోక్తి...

ఐపీఎల్ మొదలవుతోంది అంటే అభిమానుల్లో పండగే పండగ. సినిమాల్ని విపరీతంగా ప్రేమించే భారతీయులు ఐపీఎల్ పోటీలు జరిగిన రోజుల్లో వాటి జోలికే పోరంటే అతిశయోక్తి కాదు. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన అతి పెద్ద క్రికెట్ సంబరం ఈరోజు సాయంత్రం ప్రారంభం కానుంది. దుబాయ్ లోని అబూదబీ స్టేడియంలో ఐపీఎల్ 2020 తొలిమ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ లో గత సీజన్ విన్నర్స్ ముంబాయి ఇండియన్స్.. రాన్నర్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి. కరోనా నేపధ్యంలో తొలిసారిగా ప్రేక్షకులు స్టేడియంలో లేకుండానే మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆన్ లైన్ లోనే మ్యాచ్ చూడటానికి ఇప్పటికే సిద్ధం అయిపోయారు.

నువ్వా..నేనా?

ముంబై ఇండియన్స్..చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు తలపడినా అది నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య అపోటీ అంటే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక ఐపీఎల్ 2020 తోలి సమరం ఈ రెండు టీంల మధ్యే జరగనుండడం తో ఏ టీం తోలి మ్యాచ్ గెలిచి దూసుకుపోతుండానే ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ నెలకొని ఉంది. ముంబై ఇండియన్స్ టీం కి రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి ధోనీ కెప్టెన్. నాలుగుసార్లు రోహిత్ సేన ఐపీఎల్ గెలిచింది. మహీ సారధ్యంలో చెన్నై మూడుసార్లు టోర్నీ విజేత గా నిలిచింది. అయితే, ఫైనల్ కు చేరిన మ్యాచుల్లో ఎక్కువ మ్యాచులు ముంబై టీం గెలవగా.. చెన్నై టీం ఎక్కువ సార్లు రన్నరప్ గా నిలిచింది. ఇక ముంబాయితో ఇప్పటి వరకూ 28 మ్యాచుల్లో చెన్నై తలపడింది. వాటిలో 11 విజయాలు సాధించింది. మరో 17 సార్లు ముంబాయి గెలిచింది. గత నాలుగు సీజన్ల లోనూ ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతూ వస్తున్నాయి. అయితే, అందులో మూడు సార్లు ముంబాయి గెలిచింది.

ఇక ఈ రెండు జట్ల బలాబలాలు అంచనా వేయాలంటే ముందు ఈ జట్ల కెప్టెన్ లగురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఒక టీం కు రోహిత్.. రెండో టీం కు ధోనీ సారధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరి నాయకత్వ ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఎందులోనూ తీసిపోరు. డికాక్‌, రోహిత్‌, క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌, కృనాల్‌తో ముంబాయి టీం బ్యాటింగ్ లో టాప్ లేపేలా కనిపిస్తోంది. మరోవైపు ధోనీ సేన రాయుడు, వాట్సన్, దోనీ, మురళీ vijay, కేదార్ ల పైనే ఆధారపడింది. అయితే, జడేజా, దీపక్ అవసరం అయితే బ్యాటు తోనూ రాణించే సత్తా ఉంది. ఇక బుమ్రా బౌలింగ్ పరంగా ముంబాయికి వెన్నెముక అని చెప్పాలి. ఇక చెన్నైకి జడేజా, పెయూష్, తాహిర్, కేడర్, కర్ణ శర్మ బౌలింగ్ లో సత్తా చూపించే అవకాశం ఉంది. మొత్తమ్మీద చూసుకుంటే.. రెండు టీము లలోనూ బ్యాటింగ్ విభాగంలో ముంబాయి కొంత పటిష్టంగా కనిపిస్తోంది. కానీ, కెప్టెన్ కూల్ చెన్నైకి ఉన్నాడు. అదొక్కటే రెండు టీములకు తేడా!

మొదటి మ్యాచ్ లో తలబడబోయే జట్ల వివరాలు ఇవే (అంచనా)

చెన్నై: షేన్ ‌వాట్సన్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, ఎంఎస్‌ ధోనీ (కె, వి), కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌బ్రావో, రవీంద్ర జడేజా, పియూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

ముంబయి: రోహిత్‌ శర్మ (కె), క్వింటన్‌ డికాక్‌ (వి), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

Show Full Article
Print Article
Next Story
More Stories