ఈ ఇండియ‌న్ మన అందరినీ గర్వపడేలా చేశాడు: సచిన్‌

Sachin Tendulkar shares viral video
x

ఈ ఇండియ‌న్ మన అందరినీ గర్వపడేలా చేశాడు: సచిన్‌

Highlights

ఓ కుర్రాడి టాలెంట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఫిదా అయిపోయాడు. క‌ళ్లు మూసుకుని రూబిక్స్‌ క్యూబ్ ను 17 సెకన్లలోనే సెట్ చేసి ఆ కుర్రాడు ఔరా...

ఓ కుర్రాడి టాలెంట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఫిదా అయిపోయాడు. క‌ళ్లు మూసుకుని రూబిక్స్‌ క్యూబ్ ను 17 సెకన్లలోనే సెట్ చేసి ఆ కుర్రాడు ఔరా అనిపిస్తున్నాడు. ఆ కుర్రాడిని క‌లిసిన స‌చిన్ అత‌డు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తుండ‌గా స్వ‌యంగా వీడియో తీసి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ముంబైకి చెందిన ఆ టీనేజర్‌ మహ్మద్‌ అమన్‌ కొలీ గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కాడు. ఈ ఇండియ‌న్ మన అందరినీ గర్వపడేలా చేశాడంటూ సచిన్ ప్ర‌శంసించాడు. సాధార‌ణంగా మనం క‌ళ్లు తెరిచి చూస్తూ కూడా చేయలేని పనిని అతడు చూడకుండానే చేశాడ‌ని సచిన్ చెప్పాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories