Sachin Tendulkar On Friendship Day : కష్టమైనా, సంతోషానైనా కలిసి పంచుకోవడమే స్నేహం : సచిన్

Sachin Tendulkar On Friendship Day : స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని

Krishna
Updated on: 2 Aug 2020 4:53 PM IST
Sachin Tendulkar On Friendship Day : కష్టమైనా, సంతోషానైనా కలిసి పంచుకోవడమే స్నేహం : సచిన్
X
Sachin tendulkar (File Photo)

Sachin Tendulkar On Friendship Day : స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదయంలో గుబాళిస్తుంది.

ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది...ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది...కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.

ఇలాంటి స్నేహితుల కోసం ఓ రోజు ఉంది. అదే స్నేహితుల దినోత్సవం. ఇంతటి గొప్ప స్నేహితుల దినోత్సవాన్ని మన భారత దేశంలో ప్రతి ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున 'ఫ్రెండ్‌షిప్‌ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు. అందులో భాగంగానే భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పాడు ." స్నేహబంధం అనేది స్టేడియంలోని ఫ్లడ్‌ లైట్ల లాంటిది. ఓ మూల నుంచి మన విజయాలను ఆస్వాధిస్తాయి. వెలుగు దూరమై సూర్యుడు అస్తమిస్తున్న వేళ వాటంతటవే వెలిగి చీకటిని తొలగించి వెలుగునిస్తాయి" అని సచిన్ పేర్కొన్నాడు.



Krishna

Krishna

Next Story