మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మరో అరుదైన ఘనత

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మరో అరుదైన ఘనత
x
Highlights

భారత క్రికెట్ లెజెండ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ లో చోటు లభించింది. ఐసీసీ తన ట్విట్టర్...

భారత క్రికెట్ లెజెండ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ లో చోటు లభించింది. ఐసీసీ తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. 'లెజెండ్‌ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం' అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ అని ఐసీసీ పొగడ్తల వర్షం కురిపించింది. కాగా ఈ ఘనత అందుకున్న ఆరో భారతీయుడు సచిన్ టెండూల్కర్. ఇంతకు ముందు బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌(2009), కపిల్‌దేవ్‌(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్‌ ద్రవిడ్‌ (2018) లకు ఈ ఘనత దక్కింది.

సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు కూడా ఈ అవకాశం లభించింది. దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ అలన్‌ డోనాల్డ్‌(52) సైతం ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌కి ఎంపికయ్యాడు. అతడు టెస్టుల్లో 330, వన్డేల్లో 272 వికెట్లు తీసి 2003లో రిటైరయ్యాడు. అలాగే మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌, ఆసీస్‌ మాజీ పేసర్‌ ఫిట్జ్‌పాట్రిక్‌ సైతం ఈ గౌరవం దక్కింది. ఈమె వన్డేల్లో 180, టెస్టుల్లో 60 వికెట్లు తీసింది. ఆసీస్‌ మహిళా జట్టుకు కోచ్‌గా వ్యవహరించి మూడుసార్లు ఆ జట్టుని ప్రపంచకప్‌ విజేతగా నిలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories