సచిన్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్

Arun Chilukuri
Published on: 27 Nov 2020 12:49 PM IST
సచిన్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్
X

క్రికెట్ దిగ్గడం సచిన్‌కు సాయం చేశాడో ఆటో డ్రైవర్ ! ఆటో డ్రైవర్ ఏంటి.. సచిన్‌కు సాయం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఆ ఆశ్చర్యాన్ని కాసేపు అలాగే ఆపుకోండి ! ముంబైలోని సబర్బన్‌ వీధుల్లో ట్రావెల్ చేస్తూ సచిన్ దారి మర్చిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియకపోవడంతో అది గమనించిన ఆటో డ్రైవర్ ఆయనకు సాయం చేశారు. డ్రైవర్ చెప్పిన దారి ప్రకారం గమ్యాన్ని చేరుకున్న సచిన్ తనకు సాయం చేసిన వ్యక్తిని కలిసి మాట్లాడాడు. తర్వాత అతని కలిసి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ఓ సెల్ఫీ దిగాడు. అయితే ఈ సంఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినా సచిన్ ఇప్పుడు బయటపెట్టాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్‌కు ఉన్న అదృష్టం మాకు లేకపాయె అని అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story