Sachin Tendulkar Asks Fans : అభిమానుల సాయం కోరిన సచిన్‌..

Sachin Tendulkar Asks Fans : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిమానులను సాయం కోరాడు.. తన మొదటి కారు మారుతీ 800ని వెతకటంలో సహాయం

Krishna
Published on: 21 Aug 2020 12:12 PM IST
Sachin Tendulkar Asks Fans : అభిమానుల సాయం కోరిన సచిన్‌..
X

Sachin Tendulkar asks fans to help him find his first car

Sachin Tendulkar Asks Fans : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిమానులను సాయం కోరాడు.. తన మొదటి కారు మారుతీ 800ని వెతకటంలో సహాయం చేయాలనీ సచిన్‌ అభిమానులను కోరాడు.. దానితో ఉన్న అనుబంధం ప్రత్యేకమని అన్నారు.. సచిన్ కి కార్లంటే చాలా ఇష్టం.. తాను ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అయన తొలినాళ్లలో ఆ కారును కొనుకున్న సచిన్ ఆ తరవాత ఆ కారును అమ్మేశారు.. అయితే అది ప్రస్తుతం తన వద్ద లేదని ఎవరికైనా అది కనిపించినట్లయితే తనను సంప్రదించాలని కోరాడు. 'ఇన్ ది స్పోర్ట్‌లైట్' షో యొక్క ప్రత్యేక ఎపిసోడ్‌లో సచిన్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు..

నాలుగు చక్రాల పట్ల తనకున్న అభిరుచిని సచిన్ గుర్తుచేసుకుంటూ "నా ఇంటి దగ్గర భారీ ఓపెన్ డ్రైవ్-ఇన్ మూవీ హాల్ ఉంది, అక్కడ ప్రజలు తమ కార్లను పార్క్ చేసి వారు తమ కార్లలో కూర్చుని అక్కడ సినిమా చూసేవారు. కాబట్టి నేను, నా సోదరుడితో కలిసి, ఆ కార్లను చూడటానికి గంటల తరబడి రకరకాల కార్లను చూడటంతో.. తనకు వాటిపై ఇష్టం పెరిగిందని సచిన్‌ వెల్లడించాడు..

భారత క్రికెట్ కి సచిన్ చాలా సేవలను అందించాడు.. అతిపిన్న వయస్సులో జట్టులోకి వచ్చిన సచిన్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.. అత్యధిక వన్డేలను ఆడిన క్రికెటర్ గా సచిన్ పేరు పొందాడు..

Krishna

Krishna

Next Story