IPL 2021: ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు విజయం

IPL 2021: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ * రెండు వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్

Sandeep Eggoju
Published on: 10 April 2021 6:41 AM IST
Royal Challengers Bengaluru Win on Mumbai Indians
X
ఆర్సీబీ & ముంబై ఇండియన్స్ (ఫైల్ ఇమేజ్)

IPL 2021: ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బోణీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన తొలి మ్యా్చ్‌లో ముంబై ఇండియన్స్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది బెంగళూరు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేయగా.. బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. డివిలియర్స్ 48 పరుగులు చేయగా... మ్యాక్స్ వెల్ 39, విరాట్ కోహ్లీ 33 పరుగులు సాధించారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, జాన్సెన్ రెండేసి వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, కృనాల్ పాండ్య చెరో వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ టీమ్‌లో క్రిస్ లిన్ 49 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story