IND vs BAN: బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ శర్మ..!

Rohit Sharma Completes 11,000 Runs in ODIs, Becomes 4th Indian to Achieve This Milestone
x

IND vs BAN: బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ శర్మ..!

Highlights

IND vs BAN: రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో 11,000 పరుగులు పూర్తి చేశారు. రోహిత్ తన కెరీర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌తో ఈ ఫీట్ సాధించాడు.

IND vs BAN: రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో 11,000 పరుగులు పూర్తి చేశారు. రోహిత్ తన కెరీర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌తో ఈ ఫీట్ సాధించాడు. అంతకు ముందు 10,988 పరుగుల వద్ద ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఇన్నింగ్స్‌లో రోహిత్ 12 పరుగులు చేసిన వెంటనే 11 వేల పరుగుల మార్క్ ను తాకాడు. ఇప్పుడు రోహిత్ 11వేల పరుగులు సాధించిన నాలుగో భారతీయ బ్యాట్స్ మాన్ గా నిలిచాడు.

రోహిత్ శర్మ కంటే ముందు వన్డే మ్యాచ్లలో ముగ్గురు భారతీయ బ్యాట్స్ మెన్ మాత్రమే 11,000 పరుగులు పూర్తి చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్, తన వన్డే కెరీర్‌లో 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 13,963 పరుగులు చేశాడు. మూడవ స్థానంలో సౌరవ్ గంగూలీ ఉన్నారు. అతను తన వన్డే కెరీర్‌లో 11,221 పరుగులు చేశాడు.

సచిన్ టెండూల్కర్ - 18,426 పరుగులు

విరాట్ కోహ్లీ - 13,963 పరుగులు

సౌరవ్ గంగూలీ - 11,221 పరుగులు

రోహిత్ శర్మ - 10,000+ పరుగులు

సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు

వన్డే క్రికెట్ చరిత్రలో వేగంగా 11 వేల పరుగులు సాధించిన విషయంలో రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టారు. సచిన్ 276 ఇన్నింగ్స్‌లలో తన 11 వేల పరుగులు పూర్తి చేశాడు. కాని రోహిత్ తన కెరీర్లో 261 వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు వన్డే క్రికెట్‌లో వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. ఇతడు 222 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును పూర్తి చేశాడు.

విరాట్ కోహ్లీ - 222 ఇన్నింగ్స్

రోహిత్ శర్మ - 261 ఇన్నింగ్స్

సచిన్ టెండూల్కర్ - 276 ఇన్నింగ్స్

రికీ పాంటింగ్ - 286 ఇన్నింగ్స్

రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో 500 పరుగులు పూర్తి చేశారు. అంతకుముందు, అతను 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 481 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలో తన 500 పరుగులు పూర్తి చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 41 పరుగులు సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. దీనివల్ల ఛాంపియన్స్ ట్రోఫీలో తన మొత్తం పరుగులు ఇప్పుడు 522కు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories