Rohit Sharma: విరాట్ రికార్డ్ బ్రేక్ చేసిన టీమిండియా కెప్టెన్

Rohit Sharma: అత్యధిక సార్లు 50ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్

Sandeep Eggoju
Published on: 21 Nov 2021 9:24 PM IST
Rohit Sharma breaks Virat Kohlis record with most fifty-plus scores in T20 Internationals
X
విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ (ఫైల్ ఇమేజ్)

Rohit Sharma: ఇంటర్‌నేషనల్ టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సష్టించాడు. అత్యధిక సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఇవాల్టి మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. రోహిత్ మొత్తం 30సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ 29సార్లు 50కి పైగా పరుగులు చేయగా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story