Ravi Shastri: బాలీవుడ్ నటితో రవిశాస్త్రి పెళ్లి

Ravi Shastri Responded to Rumours of Marriage with Bollywood Actress
x

Ravi Shastri-Nimrat Kaur:(twitter)

Highlights

Ravi Shastri : టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బాలీవుడ్ నటితో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు.

Ravi Shastri: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బాలీవుడ్ నటితో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే కొన్నాళ్ల కిందట బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తనపై ఎన్నిరకాల మీమ్స్, ట్రోల్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోని ఈ భారత మాజీ కెప్టెన్.. తన వల్ల కొందరైనా నవ్వితే, సంతోషమేనంటూ కొట్టి పారేస్తాడు. అయితే రవిశాస్త్రిపై ఇంత ట్రోలింగ్ రావడానికి తాగుడుతో పాటు బాలీవుడ్ భామలతో అతను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఓ కారణం

2016లో నిమ్రత్ కౌర్‌తో కలిసి జర్మన్ బ్రాండ్ ఆడీ కారు ఓపెనింగ్‌కు వెళ్లిన రవిశాస్త్రి.. ఆ తర్వాత కొన్ని పార్టీలు, కార్యక్రమాల్లో ఆమెతో కలిసి కనిపించాడు. దాంతో త్వరలోనే రవిశాస్త్రి, నిమ్రత్‌ను పెళ్లాడబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారనే రూమర్స్ వచ్చాయి.

అయితే 2018 ఇంగ్లండ్ పర్యటనకు ముందు మిడ్‌ డే దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఈ రూమర్లను కొట్టిపారేశాడు. ఇదంతా ట్రాష్ అని, ఇలాంటి వాటిని తన ముందు ప్రస్తావించవద్దని ఘాటుగా బదులిచ్చాడు. ఈ రూమర్స్‌ను నిమ్రత్ కౌర్ కూడా అప్పట్లో ఖండించింది. ఇక బాలీవుడ్ హీరోయిన్ అమ్రితా సింగ్‌తో ప్రేమాయణం నడిపిన రవిశాస్త్రి.. ఆ తర్వాత 1990లో రితూ సింగ్‌ను పెళ్లాడాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా పనిచేస్తున్న రవిశాస్త్రి..ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. WTC Final తో పాటు ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్ ల సిరీస్ కోహ్లీసేన ఆడనుంది

Show Full Article
Print Article
Next Story
More Stories