KKR vs RR: నేటి మ్యాచ్ ఫలితంపై ముంబై, కలకత్తా జట్ల ప్లేఆఫ్ ఆశలు

* నేడు కలకత్తా నైట్ రైడర్స్ తో పోటీ పడనున్న రాజస్తాన్ రాయల్స్

Sandeep Reddy
Updated on: 7 Oct 2021 6:26 PM IST
Rajasthan Royals vs Kolkata Knight Rider Match Today 07 10 2021 in IPL 2021
X

నేడు కేకేఆర్ తో రాజస్తాన్ పోరు (ట్విట్టర్ ఫోటో)

KKR vs RR: రాజస్థాన్ రాయల్స్ - కలకత్తా నైట్ రైడర్స్ మధ్య రసవత్తర పోరుకు షార్జా స్టేడియం సిద్దమైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కి కలకత్తా జట్టు అర్హత సాధించే అవకాశం ఉండటంతో పాటు రాజస్తాన్ రాయల్స్ గెలుపుపై ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. దీంతో గురువారం ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ప్రత్యక్షంగా కలకత్తా జట్టుకు, పరోక్షంగా ముంబై జట్టుపై ప్రభావం చూపనున్నాయి.

షార్జా క్రికెట్ పిచ్ అటు బ్యాటింగ్ కే కాకుండా బౌలింగ్ కూడా అనుకూలించడంతో 170 పరుగుల వరకు స్కోర్ ని సాధించే అవకాశాలు ఈ మ్యాచ్ లో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో కలకత్తా గెలిస్తే నెట్ రన్ రేట్ తో ముంబై కంటే మెరుగ్గా ఉండటం కలకత్తా జట్టుకు కలిసొచ్చే అంశం. తరువాతి మ్యాచ్ లో ముంబై.. హైదరాబాద్ జట్టుపై ఓడితే నేరుగా కలకత్తా ప్లేఆఫ్ చేరుతుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలుపొందితే రన్ రేట్ కీలకం కానుంది.

ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ - కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లలో కలకత్తా నైట్ రైడర్స్ 12, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ లలో గెలుపొందాయి. ఇరు జట్ల తుది వివరాలు ఇలా ఉండే అవకాశాలున్నాయి..

కలకత్తా నైట్ రైడర్స్: శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (సి), షకీబ్ అల్ హసన్ / ఆండ్రీ రస్సెల్ / బెన్ కట్టింగ్, దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ / లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్/లియామ్ లివింగ్‌స్టోన్, రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా

Sandeep Reddy

Sandeep Reddy

Next Story