IND vs SL: శ్రీలంక టూర్‌కి హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్..!

IND vs SL: శ్రీలంక టూర్‌కి వెళ్లే టీంను నేడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు.

Venkata Chari
Updated on: 11 May 2021 5:45 PM IST
Rahul Dravid is Head Coach For Srilanka Tour
X

రాహుల్ ద్రవిడ్ (ఫొటో ట్విట్టర్)

IND vs SL: మూడేళ్ల తరువాత టీం ఇండియా లంక పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు శ్రీలంక టూర్‌కి వెళ్లే టీంను నేడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తోపాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే టీంను ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానున్నందున, సెకండ్ టీం ను శ్రీలంక పర్యటనకు పంపనుంది. మొదటి టీం విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే శ్రీలంక టూర్ ‌లో ఆడే టీం ఇండియాకు కెప్టెన్ గా ఇంతవరకు ఎవరీని ఫైన్ల్ చేయలేదు.

కాగా, శ్రీలంక లో భారత వన్డే జట్టుకు ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి అందుబాటులో ఉండడు. ఈ మేరకు బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌కు శ్రీలంక టూర్‌కి హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించనుందని తెలుస్తోంది. ద్రవిడ్‌తో పాటు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఎ) సిబ్బందిని కూడా శ్రీలంక టూర్‌కు పంపనున్నారని సమాచారం.

Venkata Chari

Venkata Chari

Next Story