Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్

Rafael Nadal: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2024 4:49 PM IST
Rafael Nadal Announces Retirement From Tennis
X

Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్

Rafael Nadal: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు. గత రెండేళ్లు కఠినంగా గడిచాయని..ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టిందన్నాడు. జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం ముగింపు అనేది ఉంటుందన్న రఫెల్.. డెవిస్ కప్ తర్వాత..ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు నాదల్.

క్లే కోర్టు రారాజుగా వెలుగొందిన నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించాడు. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశించాడు. మరో నాలుగు సంవత్సరాలకే తొలి టైటిల్‌.. 2005-ఫ్రెంచ్‌ ఓపెన్ ను తన ఖాతాలో వేసుకొని ఒక్కసారిగా క్రీడాలోకాన్ని తనవైపు చూసేట్లు చేశాడు. ఈ స్పెయిన్ బుల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్‌ టైటిళ్లు సాధించాడు. ఇందులో 14 ఫ్రెంచ్‌ ఓపెన్ టైటిల్స్‌ ఉన్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story