PV Sindhu: సింగ‌పూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధు

PV Sindhu Vs Wang Zhi Yi: సింగపూర్ ఓపెన్‌లో తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చాంపియన్‌గా అవతరించింది.

Arun Chilukuri
Published on: 17 July 2022 1:22 PM IST
PV Sindhu Wins her Third Title in 2022
X

PV Sindhu: సింగ‌పూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధు

PV Sindhu Vs Wang Zhi Yi: సింగపూర్ ఓపెన్‌లో తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చాంపియన్‌గా అవతరించింది. సింగ‌పూర్ ఓపెన్ టైటిల్ ఫైన‌ల్ నెగ్గిన సింధు సింగ‌పూర్ ఓపెన్ విజేత‌గా నిలిచింది. టైటిల్ పోరులో చైనాకు చెందిన వ్యాంగ్ జీ ఈని ఓడించి విజేత‌గా నిలిచింది. 21-9, 11-21, 21-15 స్కోరుతో సింధూ ఫైనల్‌లో విజ‌యం సాధించింది.

ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు టైటిళ్లు నెగ్గిన పీవీ సింధు తాజాగా సింగ‌పూర్ ఓపెన్ టైటిల్‌తో క‌లిపి మొత్తం మూడు టైటిళ్లను త‌న ఖాతాలో వేసుకుంది. మొన్న క్వార్టర్స్ చేరిన సింధు సెమీస్‌ను కూడా ఈజీగానే గెలిచింది. అయితే ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలి సెట్‌ను అల‌వోక‌గా గెలిచిన సింధు రెండో సెట్‌లో అనూహ్యంగా ఓట‌మిపాలైంది. మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్దేశించే మూడో సెట్‌లో తిరిగి శ‌క్తిని కూడ‌దీసుకున్న సింధు త‌న ప్రత్యర్థి ఏమాత్రం కోలుకోకుండా మెరుపు దాడి చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story