PV Sindhu: కోచ్‌ పార్క్‌కు సింధు గుడ్‌బై.. కొత్త కోచ్‌ను వెతుక్కుంటున్న..

PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను వెతుక్కునే పనిలో పడింది.

Arun Chilukuri
Published on: 25 Feb 2023 11:58 AM IST
PV Sindhu Parts Ways With coach Park Tae-Sang
X

PV Sindhu: కోచ్‌ పార్క్‌కు సింధు గుడ్‌బై.. కొత్త కోచ్‌ను వెతుక్కుంటున్న..

PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను వెతుక్కునే పనిలో పడింది. ఇప్పటి వరకు తనకు కోచ్‌గా వ్యవహరిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన పార్క్ తే సంగ్ సేవలకు గుడ్‌బై చెప్పేసింది. 2019 నుంచి పార్క్-సింధు కలిసి పనిచేస్తున్నారు. పార్క్ హయాంలో సింధు మూడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిళ్లు, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్‌లను గెలుచుకుంది. అలాగే, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.

ఈ విషయాన్ని పార్క్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ భారమైన పోస్టు పెట్టాడు. ''సింధుతో నా అనుబంధం గురించి చాలామంది అడుగుతున్నారు. ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో ఆమె నిరాశపరిచింది. కోచ్‌గా అందుకు నేను బాధ్యత వహిస్తున్నా. ఆమె మార్పు కోరుకుంది. కొత్త కోచ్‌ను వెతుక్కుంటానని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నా. వచ్చే ఒలింపిక్స్‌ వరకు సింధుతో ఉండలేకపోతున్నందుకు క్షమించండి. కాని దూరం నుంచి ఆమెకు మద్దతు తెలుపుతా'' అని పార్క్‌ పేర్కొన్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story