PV Sindhu: BWF వరల్డ్‌టూర్‌లో సిల్వర్‌తో సరిపెట్టుకున్న సింధు

PV Sindhu: దక్షిణ కొరియా ఆన్ సేయంగ్ చేతిలో పరాజయం

Sandeep Eggoju
Published on: 5 Dec 2021 3:19 PM IST
PV Sindhu got the Silver Medal in BWF World Tour
X

పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)

PV Sindhu: BWF వరల్డ్ టూర్ లో పీవీ సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఫైనల్స్‌లో సింధు ఓటమి పాలైంది. సౌత్‌ కొరియా ప్లేయర్ ఆన్ సేయంగ్ చేతిలో 16-21, 12-21 చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. వరల్డ్ నంబర్ సిక్స్ అయిన సేయంగ్ ఆటకు ఏ దశలోనూ సింధు పోటీ ఇవ్వలేకపోయింది. నెట్ ప్లే, బేస్ లైన్ గేమ్‌తో సింధుకు సేయంగ్ సవాల్ విసిరింది. ఎక్కడ కూడా సింధుకు అవకాశం ఇవ్వకుండా ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించింది. సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు BWF వరల్డ్ టూర్‌లో ఫైనల్‌కు వెళ్లడం సింధుకు ఇది మూడోసారి. అంతకుముందు 2018లో సింధు తొలిసారి టైటిల్ ను గెలిచి మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story