Andhra Pradesh News: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు, రజని

Andhra Pradesh News: ఇటీవల కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధు, భారత హాకీ క్రీడాకారిణి రజని ఏపీ సీఎం జగన్‌ను కలిశారు.

Arun Chilukuri
Updated on: 25 Aug 2022 9:16 PM IST
PV Sindhu and Hockey Player Rajini Meets CM Jagan
X

Andhra Pradesh News: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు, రజని

Andhra Pradesh News: ఇటీవల కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధు, భారత హాకీ క్రీడాకారిణి రజని ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల స‌త్తాను జ‌గ‌న్ కీర్తించారు. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు ప‌సిడి ప‌త‌కంతో మెరిశారు. అదే స‌మ‌యంలో మునుప‌టి కంటే మెరుగ్గా రాణించిన భార‌త హాకీ జ‌ట్టులో ర‌జ‌నీ కీల‌క భూమిక పోషించింది. కామ‌న్వెల్త్ గేమ్స్ ముగిసిన త‌ర్వాత ఇటీవ‌లే రాష్ట్రానికి చేరుకున్న సింధు, ర‌జ‌నిలు ఇటీవలే ఏపీ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఇంటికి వెళ్లారు. రోజా కుటుంబంతో క‌లిసి వారిద్దరూ మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా చేశారు. తాజాగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన క్రీడాకారులు సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story