T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌ హ్యాట్రిక్‌ విక్టరీ

*ఆఫ్ఘానిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ *అసిఫ్‌ అలీ కేవలం 7 బంతుల్లోనే 25 రన్స్

Shilpa
Updated on: 30 Oct 2021 6:58 AM IST
Pakistan Won the Match Against Afghanistan with 5 Wickets in T20 World Cup 2021
X

పాకిస్తాన్ - ఆఫ్గనిస్తాన్ (ఫైల్ ఫోటో)

T20 WorldCup 2021: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ హైట్రిక్‌ విక్టరీ కొట్టేసింది. దుబాయ్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుత ఆటతీరును కనబరచడంతో పాక్‌ ఖాతాలో మరో విజయం వచ్చి పడింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది.

ఇంకా ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన 148 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. పాక్‌ బ్యాట్స్‌మెన్స్‌లో బాబార్‌ అజమ్‌ 51 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఇక జమాన్‌ కూడా 25 బంతుల్లో 30 పరుగులు సాధించి స్కోర్‌ బోర్డు స్పీడ్‌ను పెంచాడు. ఇక చివరిలో వచ్చిన అసిఫ్‌ అలీ కేవలం 7 బంతుల్లోనే 25 రన్స్ చేసి అదరగొట్టాడు.

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. మ్యాచ్‌ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా తర్వాత కెప్టెన్‌ మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్ చేరో 35 రన్స్ చేసి పర్వాలేదనిపించారు.

Shilpa

Shilpa

Next Story