Former Skipper Sarfraz Ahmed: నాకు ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌ ఆమే..

Former Skipper Sarfraz Ahmed: బాలీవుడ్ హీరోయిన్‌పై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మనసు పారేసుకున్నాడు.

Samba Siva Rao
Published on: 28 Jun 2020 6:45 PM IST
Former Skipper Sarfraz Ahmed: నాకు ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌ ఆమే..
X
sarfraj Ahmed (File Photo)

Former Skipper Sarfraz Ahmed: బాలీవుడ్ హీరోయిన్‌పై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మనసు పారేసుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్స్‌ని పాకిస్థాన్ క్రికెటర్లు ఇష్టపడటం కొత్తేమీ కాదు. గతంలో ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. సోనాలీ బింద్రేపై మనసు పారేసుకున్నాడు. తాజాగా సర్ఫరాజ్ కూడా ఇష్టమైన బాలీవుడ్ హీరయిన్ పేరు చెప్పాడు. జులై 28 నుంచి మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ నేథ్యంలోనే నెల రోజులు ముందుగానే.. అంటే ఇవాళ ఇంగ్లాండ్ కు పాక్ జట్టు బయల్దేరి వెళ్లింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం 29 మందితో కూడిన జట్టుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేసింది.

ఇటవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10 మంది క్రికెటర్లకి కరోనా సోకినట్లు గత సోమవారం వెలుగులోకి వచ్చింది. మళ్లీ నిర్వహించిన తర్వాత శనివారం ఈ పదిలో ఆరుగురికి నెగటివ్ వచ్చినా.. అయితే వానిని ఇంగ్లాండ్ పర్యటనకు మాత్రం పంపలేదు. సర్ఫరాజ్ అహ్మద్‌కి రెండు సార్లు నిర్వహించిన టెస్టులో నెగటివ్ వచ్చింది. దాంతో.. అతను టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌కి వెళ్లిపోయాడు. అయితే.. ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లేముందు ఓ ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతుండగా..ఫేవరెట్ హీరోయిన్స్ గురించి చర్చ వచ్చింది. దాంతో.. బాలీవుడ్‌లో దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు..? అని సర్పరాజ్‌ని ప్రశ్నించగా.. కత్రినా కైఫ్ అంటే ఇష్టం అని వెల్లడించాడు.

సర్ఫారాజ్ అహ్మద్ గత ఏడాది చివర్లో పేలవ ఫిట్‌నెస్, ఫామ్ కారణంగా పాక్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయాడు. తాజాగా ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికయ్యాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా.. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ ఆవలించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సెటైర్లు పేలాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story