నాకు కరోనా లేదు.. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకున్న : పాక్ క్రికెటర్

నాకు కరోనా లేదు.. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకున్న : పాక్ క్రికెటర్
x
Highlights

కరోనా ప్రభావంతో తరచూ వివాదాలతో నడుస్తున్న పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర సంక్షోభంతో కురుకుపోయింది. చాలా కాలం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్‌ క్రికెట్‌ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది

కరోనా ప్రభావంతో తరచూ వివాదాలతో నడుస్తున్న పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర సంక్షోభంతో కురుకుపోయింది. చాలా కాలం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్‌ క్రికెట్‌ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు కరోనా సెగ తగిలింది. ఆ జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదికి కొవిడ్ సోకగా..ఇటీవలే ఓ దివ్యాంగ ఆటగాడు ఇర్ఫాన్ కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాడ్ సిరీస్‌ కోసం ఎంపికైన 29 మంది క్రికెటర్లకు కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించారు. జట్టులో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. క్రికెట్ జట్టులో ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్‌ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం పాక్‌ యువ ఆటగాడు హైదర్‌ అలీతో పాటు హారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్లు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, వహాబ్ రియాజ్‌లు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ జాబితాలో పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ కూడా ఉన్నాడు.

కరోనా నిర్దారణ అయిందని ప్రకటించిన 24 గంటలు గడవకముందే తనకు కరోనా లేదని హఫీజ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ట్వీటర్ వేదికగా స్పందించిన హఫీజ్ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో మరోసారి కోవిద్ పరీక్షలు జరిపించుకన్నానని, ఇందులో నెగటీవ్ వచ్చిందని స్పష్టం చేశాడు. టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్టులను కూడా పంచుకున్నాడు.

రిపోర్ట్స్‌లో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని పీసీబీ మంగళవారం స్పష్టం చేసింది. అయితే కుటుంబంతో కలిసి పరీక్షలు చేయించుకున్నా. నాతో సహా మా కుటుంబ సభ్యులకు నెగటీవ్ వచ్చింది. ఆ అల్లానే మా అందరిని సురక్షితంగా ఉంచుతాడు'అని ట్వీట్ చేశాడు.

ఈ నెల 28న పాక్ జట్టు ఇంగ్లండ్‌ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించడం విశేషం. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌తో 3 టెస్టులు, 3 టీ20లను అడనుంది. 10మంది పాక్ క్రికెటర్లకు కరోనా సోకినా ఇంగ్లండ్‌ బయల్దేరుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories