కరోనా కేసులు అందుకే పెరుగుతున్నాయి : నిపుణులు

కరోనా కేసులు అందుకే పెరుగుతున్నాయి : నిపుణులు
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు వేలాదిగా పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు వేలాదిగా పెరుగుతున్నాయి. అమెరికా తరువాత బ్రెజిల్ లో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ ప్రతిరోజు 30 వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాంతో అమెరికా తరువాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఇక్కడ 11 లక్షలకు చేరువలో కేసులున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం అత్యధికంగా 183,000 పైగా కేసులను నమోదు అయ్యాయి. ఇందులో 54,771 కేసులతో బ్రెజిల్ ముందుందని, అమెరికాలో 36,617 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అలాగే భారతదేశంలో 15,400 కు పైగా వైరస్ కేసులొచ్చాయని తెలిపింది. పెరుగుతున్న కేసులు విస్తృతమైన పరీక్షల కారణంగానే వస్తున్నాయని who నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 4 లక్షల 61 వేల 804 మంది మరణించారు. సోకిన వారి సంఖ్య 90 లక్షల 52 వేల 579 కు చేరుకుంది. ఇప్పటివరకు 48 లక్షల 41 వేల 948 మంది ఆరోగ్యంగా ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories