T20 World Cup 2021: టీమిండియాతో తలపడే పాకిస్తాన్ జట్టు ఇదే..

* అక్టోబర్ 24 ఆదివారం రోజు భారత్ - పాక్ మ్యాచ్ కోసం 12 మంది ఆటగాలను ప్రకటించిన పాక్

Sandeep Reddy
Published on: 23 Oct 2021 3:37 PM IST
Pakistan Cricket Board Announced Pakistan Squad For India vs Pakistan Match in T20 World Cup 2021
X

T20 World Cup 2021: టీమిండియాతో తలపడే పాకిస్తాన్ జట్టు ఇదే..

Pakistan Squad: అక్టోబర్ 24న ఆదివారం భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగే జరగబోయే మ్యాచ్ కోసం 12 మంది ఆటగాళ్ళతో తుది జట్టు జాబితాని పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యం తాజాగా ప్రకటించింది. భారత్ తో జరగబోయే మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లోనైన పాకిస్తాన్ గెలిచి టీ20 ప్రపంచకప్ 2021లో శుభారంభాన్ని అందించాలని భావిస్తుంది.

జట్టులో మాలిక్, హఫీజ్ వంటి అనుభవం ఉన్న ఆటగాళ్ళ ఆలోచనలు, ప్రణాళికలు జట్టుకి సహాయపడుతాయని, గత కొంతకాలంగా యూఏఈలో మ్యాచ్ లు ఆడటం వలన ఇక్కడి పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లో పాక్ జట్టు తరపున ఆడబోయే 12 మంది ఆటగాళ్ళ జాబితా ఇలా ఉంది.

పాకిస్తాన్ జట్టు:

బాబర్ అజామ్ (C), మహ్మద్ రిజ్వాన్ (Wk), ఫఖర్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ హఫీజ్, మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్ (VC), ఇమాద్ వసీం, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్



Sandeep Reddy

Sandeep Reddy

Next Story